రెండు రోజులపాటే అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2020-06-16T20:58:12+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు మాత్రమే (ఇవాళ, రేపు) జరగనున్నయని ప్రభుత్వం..

రెండు రోజులపాటే అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు మాత్రమే (ఇవాళ, రేపు) జరగనున్నయని ప్రభుత్వం బీఏసీ సమావేశం అనంతరం ప్రకటించింది. మంగళవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేసించి ప్రసంగించారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పూర్తయిన తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడుతుంది.


బుధవారం ప్రభుత్వం కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ మాత్రం దానికి ప్రతిపక్ష పాత్ర ఏముందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు బీఏసీలో ప్రశ్నించారు. మిగతా ఏం చేయాలనుకున్నది మీరు నిర్ణయించుకోవాలని సీఎం జగన్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుందని, చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారని రామానాయుడు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందని సీఎం అన్నారు. అలా అయితే వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని రామానాయుడు కోరారు. దీనిపై స్పీకర్ జోక్యం చేసుకుని టెక్నికల్ సమస్య వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి జోక్యం చేసుకుని పార్లమెంట్ సమావేశాలు వర్చువల్‌గా జరిగితే అప్పుడు చూద్దామని అన్నారు. రెండు రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని ఎక్కడా చర్చలు ఉండవని ఆయన మరోమారు స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-16T20:58:12+05:30 IST