ఆలయాల్లో ‘ఆన్‌లైన్ పూజలు’
ABN , First Publish Date - 2020-05-19T11:58:01+05:30 IST
ఆలయాల్లో ‘ఆన్‌లైన్ పూజలు’

అమరావతి(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ దర్శనాల నిలిపివేతను కొనసాగిస్తున్నట్టు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, భక్తుల కోరిక మేరకు వారి గోత్రనామాలపై ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక పూజలు(పరోక్ష విధానంలో) చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.