కర్నూలు జిల్లా: అహోబిలంలో ఆన్‌లైన్ మోసం
ABN , First Publish Date - 2020-10-03T14:21:37+05:30 IST
ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో ఆన్‌లైన్ మోసం జరిగింది.

కర్నూలు జిల్లా: ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో ఆన్‌లైన్ మోసం జరిగింది. రూ.లక్ష కడితే రూ.3 లక్షలు సంపాదించుకోవచ్చంటూ బెటర్ వే ఆన్‌లైన్ స్కీం నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు. రూ. లక్షకు రూ.22,500 కమీషన్ ఇస్తామని..ఏజెంట్లకు ఆశచూపారు. కమీషన్ కోసం ఆశపడిన ఏజెంట్లు ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో సుమారు రూ.4 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు బెటర్ వే సర్వర్ క్లోజ్ కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అహోబిలంకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి స్కీంలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు హెచ్చరించారు.