వెటర్నరీ వర్సిటీలో ‘ఆన్‌లైన్‌’ బోధన

ABN , First Publish Date - 2020-04-12T07:39:54+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా అన్ని విద్యాసంస్థలూ మూతపడిన విషయం తెలిసిందే. మరో రెండు నెలలకుపైగా విద్యార్థులకు తరగతులు బోధించే అవకాశం...

వెటర్నరీ వర్సిటీలో ‘ఆన్‌లైన్‌’ బోధన

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 11: కరోనా వైరస్‌ కారణంగా అన్ని విద్యాసంస్థలూ మూతపడిన విషయం తెలిసిందే. మరో రెండు నెలలకుపైగా విద్యార్థులకు తరగతులు బోధించే అవకాశం కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ తరగతులకు వీసీ వై.హరిబాబు చర్యలు చేపట్టారు. ఈ నెల 9 నుంచే ఈ తరగతులు జరుగుతున్నాయి. వెటర్నరీ డీన్‌ డాక్టర్‌ టీఎస్‌ చంద్రశేఖరరావు, పాథాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డాక్టర్‌ ఆనందకుమార్‌ సహకారంతో జూమ్‌ క్లౌడ్‌ మీటింగ్‌ యాప్‌ ద్వారా వెటర్నరీ (బీఎస్సీ) విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.


Updated Date - 2020-04-12T07:39:54+05:30 IST