ఒంగోలు : కరోనా పాజిటివ్ బాధితుడు పరారీకి యత్నించగా..

ABN , First Publish Date - 2020-03-19T20:29:25+05:30 IST

ఒంగోలులో కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఒంగోలు : కరోనా పాజిటివ్ బాధితుడు పరారీకి యత్నించగా..

ఒంగోలు : జిల్లాలోని ఒంగోలులో కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలతో రిమ్స్‌లో చేరిన యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో యువకుడ్ని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే.. రిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం పారిపోవడానికి బాధితుడు యత్నించాడు. రెండో అంతస్తు నుంచి కిందికి దిగుతుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. విషయం వైద్యులు చెప్పి ఆ యువకుడ్ని ఐసోలేషన్ వార్డుకు మళ్లీ తరలించారు. పేషెంట్ బయటికి రావడంతో రోగుల్లో భయాందోళనకు గురవుతున్నారు.


ఇదిలా ఉంటే.. కరోనా సోకిన వ్యక్తి ఇంటి చుట్టూ 3 కి.మీ మేర ప్రత్యేక జోన్‌గా తీసుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మీడియాకు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉన్న రోడ్లను కూడా బ్లాక్‌ చేశామన్నారు. ఈ క్రమంలో ఒంగోలులో మాల్స్, థియేటర్లు మూసి వేయాలని ఆదేశించామని.. కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను రిమ్స్‌ ఐసోలేషన్ వార్డులో ఉంచామని తెలిపారు. కరోనా బాధితుడితో కలిసి ప్రయాణించిన వారికి ఇళ్ళ వద్దే ఐసోలేషన్‌ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

Updated Date - 2020-03-19T20:29:25+05:30 IST