ప.గో.జిల్లాలో నేలకొరిగిన వంద విద్యుత్ స్తంభాలు

ABN , First Publish Date - 2020-10-14T16:36:48+05:30 IST

పశ్చిమగోదావరి సముద్రతీరం గాలులు, వర్షాలకు విలవిల్లాడింది.

ప.గో.జిల్లాలో నేలకొరిగిన వంద విద్యుత్ స్తంభాలు

ప.గో.జిల్లా: పశ్చిమగోదావరి సముద్రతీరం గాలులు, వర్షాలకు విలవిల్లాడింది. జిల్లాలో వంద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లకు గండిపడి రాకపోకలు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం, సీతానగరం వద్ద  వాగులో చిక్కుకుపోయిన యువకుడిని అతి కష్టం మీద స్థానికులు రక్షించారు. యలమంచిలి మండలం, కట్టుపాలెంలో గుడిసె గోడ కూలి వృద్ధురాలు నారాయణమ్మ మృతి చెందింది. భారీ వర్షాలకు సీతానగరం సమీపంలో వాగు పొంగింది. 

Updated Date - 2020-10-14T16:36:48+05:30 IST