పెళ్లైన రెండో రోజు ఇంటి నుంచి పరారైన వరుడు

ABN , First Publish Date - 2020-05-29T16:52:18+05:30 IST

కోవెలకుంట్లకు చెందిన వరుడు వీరాకుమార్ అడిగినంత కట్నకానుకలు ఇచ్చారు.

పెళ్లైన రెండో రోజు ఇంటి నుంచి పరారైన వరుడు

కర్నూలు జిల్లా: కోవెలకుంట్లకు చెందిన వరుడు వీరాకుమార్ అడిగినంత కట్నకానుకలు ఇచ్చారు. పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. తాళి కట్టి ఏడడుగులు వేసిన వరుడు వధువు కాళ్ల పారాణి ఆరకముందే పరారయ్యాడు. పరారయిన భర్త కోసం అత్తవారింటిదగ్గర ఆ వధువు ఎదురుచూస్తోంది.


సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరాకుమార్‌కు పాములపాడు మండలం, ఓ గ్రామానికి చెందిన యువతితో ఫిబ్రవరి 28న నిశ్చితార్థం జరిగింది. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో ఈ నెల 24న వివాహం జరిగింది. 25న వరుని ఇంట్లో వ్రతం చేశారు. మరుసటి రోజు వధువు ఇంట్లో కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా వీరాకుమార్ ఇంటినుంచి వెళ్లిపోయాడు.

Updated Date - 2020-05-29T16:52:18+05:30 IST