-
-
Home » Andhra Pradesh » OK for engineering and beepharmacy admissions
-
ఇంజనీరింగ్, బీఫార్మసీ అడ్మిషన్లకు ఓకే
ABN , First Publish Date - 2020-12-27T07:03:49+05:30 IST
ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైది.

ఉన్నత విద్యాశాఖ అనుమతి ఉత్తర్వులు జారీ
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైది. రాష్ట్రంలోని 257 ఇంజనీరింగ్ కాలేజీలను (వర్సిటీల కాలేజీలు 18, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీలు 239) 2020-21 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ సతీశ్‌చంద్ర శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కాలేజీలకు, సీట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 120 బీపార్మసీ కాలేజీల్లో మొత్తం 10,675 సీట్లకు కూడా అనుమతులు ఇచ్చారు. తొమ్మిది విశ్వవిద్యాలయాల కాలేజీల్లో 520 సీట్లు, 111 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీల్లో 10,155 సీట్లకు అనుమతులు ఇస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది.