విదేశాల నుంచి వచ్చిన 1100 మంది ట్రాక్ చేస్తున్న అధికారులు

ABN , First Publish Date - 2020-03-23T13:20:41+05:30 IST

నెల్లూరు: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లాలో ప్రజలందర్నీ స్క్రీనింగ్ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు.

విదేశాల నుంచి వచ్చిన 1100 మంది ట్రాక్ చేస్తున్న అధికారులు

నెల్లూరు: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లాలో ప్రజలందర్నీ స్క్రీనింగ్ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా పాజిటివ్ యువకుడు కోలుకున్నాడు. ప్రస్తుత పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఒకటి రెండు రోజుల్లో డిచ్ఛార్జ్ చేసే అవకాశం ఉంది. కాగా.. విదేశాల నుంచి వచ్చిన సుమారు 1100 మందిని అధికారులు ట్రాక్ చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మద్యం, కల్లు అమ్మకాలు బంద్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-03-23T13:20:41+05:30 IST