ఎమ్మెల్యే అనుచరులమంటూ భూకబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2020-08-19T02:16:11+05:30 IST

జిల్లాలోని నూజివీడులో ఎమ్మెల్యే అనుచరులమంటూ కొందరు భూకబ్జాకు యత్నించారు. దీంతో రైతులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా

ఎమ్మెల్యే అనుచరులమంటూ భూకబ్జాకు యత్నం

కృష్ణా: జిల్లాలోని నూజివీడులో ఎమ్మెల్యే అనుచరులమంటూ కొందరు భూకబ్జాకు యత్నించారు. దీంతో రైతులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు మండలం గొడుగువారిగూడెం వద్ద 27 ఎకరాల భూమి ఉంది. అది 1983 నుండి రైతుల సాగులో ఉంది. అయితే తాజాగా వారసత్వ సంపద కింద ఈ భూమిపై తమకు హక్కు ఉందంటూ వేరే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు భూమిలోకి వచ్చి గొడవకు దిగారు. దీంతో రైతులు వారిని అడ్డుకున్నారు. భూమికి సంబంధించి పూర్తి హక్కులు తమకే ఉన్నాయని రైతులు స్పష్టం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే తమ భూమిని కబ్జా చేసేందుకు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు వర్గీయులు, వారసులు ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భూములను ఆక్రమించేందుకు వచ్చిన కాకుమాను స్రవంతి దేవి, మోవ్వ వెంకటేశ్వరరావుల వద్ద ఎలాంటి రికార్డులు లేవని, అయినప్పటికీ దౌర్జన్యానికి దిగుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-19T02:16:11+05:30 IST