నర్సులను సన్మానించిన టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-04-07T17:23:24+05:30 IST

గుంటూరు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నర్సులను టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర సన్మానించారు.

నర్సులను సన్మానించిన టీడీపీ నేత

గుంటూరు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నర్సులను టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకపండా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని వైద్య విపత్తు కరోనా అని.. ఇలాంటి పరిస్థితుల్లో నర్సుల సేవలు వెలకట్టలేనివన్నారు. టీడీపీ తరుపున ప్రతి నర్సుకూ అభినందనలు అని కోవెలమూడి రవీంద్ర తెలిపారు.


Read more