ఏపీకి రూ.178 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2020-02-12T22:20:00+05:30 IST

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.178 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది రూ.4,333.9 కోట్లు కేంద్రం మంజూరు చేసిన

ఏపీకి రూ.178 కోట్లు విడుదల చేసిన కేంద్రం

విజయవాడ: ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.178 కోట్లు నిధులు విడుదల చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ఈ ఏడాది రూ.4,333.9 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉపాధి హామీ వేతనాలకు నిధులు విడుదల చేశారు.

Updated Date - 2020-02-12T22:20:00+05:30 IST