సైంటిఫిక్ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-11-03T09:39:32+05:30 IST
రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న 58 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు. అర్హత గల అభ్యర్థుల నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలను టజూఞటఛ.్చఞ.జౌఠి.జీుఽలో తెలుసుకోవచ్చని సూచించారు.