గత ప్రభుత్వ లబ్ధిదారులకు నోటీసులు.. వారంలో వివరణకు ఆదేశాలు

ABN , First Publish Date - 2020-03-03T02:29:01+05:30 IST

కంచికచర్ల మండలం మున్నలూరులో వింత పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ...

గత ప్రభుత్వ లబ్ధిదారులకు నోటీసులు.. వారంలో వివరణకు ఆదేశాలు

కృష్ణా: కంచికచర్ల మండలం మున్నలూరులో వింత పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 35 సంవత్సరాలుగా ఇళ్ల పట్టాల స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లోనే ఇళ్ల పట్టాలు ఇచ్చారని అంటున్నారు. నోటీసులో 4-1-2020 తేదీ ఉండగా వాటిని ఈ రోజు లబ్ధిదారులకు అందజేయడంతో తిరస్కరించారు. వీరిలో కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. స్టే ఇచ్చిన వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో వాటిని నిరాకరించారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. 

Updated Date - 2020-03-03T02:29:01+05:30 IST