బోండా ఉమా, బుద్దా వెంకన్నలకు మరోసారి నోటీసులు

ABN , First Publish Date - 2020-03-19T18:46:55+05:30 IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు..

బోండా ఉమా, బుద్దా వెంకన్నలకు మరోసారి నోటీసులు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 21న విచారణకు రావాలని డీఎస్పీ నోటీసులు పంపారు. ఈ నెల 18న నోటీసులు జారీ చేసినా ఇరువురు నేతలు విచారణకు హాజరు కాలేదు. దీంతో గురువారం మరోసారి నోటీసులు పంపారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు గురజాల డీఎస్పీ వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. ఆధారాలతో రావాలని సూచించారు. 

Updated Date - 2020-03-19T18:46:55+05:30 IST