-
-
Home » Andhra Pradesh » Not the party office Shiva temple
-
పార్టీ ఆఫీసు కాదు.. శివాలయం!
ABN , First Publish Date - 2020-11-27T08:48:48+05:30 IST
పాతగుంటూరులోని శివాలయం (అగస్తేశ్వరస్వామిదేవాలయం) ఇది. కార్తీకమాసం సందర్భంగా నగరంలోని దేవాలయాలన్నింటినీ దేవుడి బొమ్మలతో అలంకరిస్తే..

గుంటూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పాతగుంటూరులోని శివాలయం (అగస్తేశ్వరస్వామిదేవాలయం) ఇది. కార్తీకమాసం సందర్భంగా నగరంలోని దేవాలయాలన్నింటినీ దేవుడి బొమ్మలతో అలంకరిస్తే.. అగస్తేశ్వరస్వామి దేవాలయాన్ని మాత్రం ఎమ్మెల్యే ముస్తఫా, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలతో కప్పేశారు. పాలకవర్గం చైర్మన్ ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేపై స్వామిభక్తిని చాటుకునేందుకు దేవాలయాన్ని ఇలా తయారు చేశారు. దీనిని స్థానికులు సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వ్యంగ్యంగా ప్రచారం జరుగుతున్నా.. పాలకమండలి పట్టించుకోవడం లేదు.