ఎవ్వరికీ భయపడను: జేసీ దివాకర్ రెడ్డి
ABN , First Publish Date - 2020-06-18T08:32:38+05:30 IST
‘ప్రభుత్వంలో కొంతమంది కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. నేను వీటన్నింటికీ భయపడే వ్యక్తినికాను...

వల్లూరు, జూన్ 17: ‘ప్రభుత్వంలో కొంతమంది కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమంగా కేసులు పెడుతున్నారు. మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. నేను వీటన్నింటికీ భయపడే వ్యక్తినికాను. వ్యాపారాలు పోయినా నేను నష్టపోను. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకోగలను’ అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు.