సీఎస్‌పై విమర్శలు తగదు: వెంకట్రామిరెడ్డి
ABN , First Publish Date - 2020-10-01T07:55:40+05:30 IST
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సా హ్ని ఆరు నెలలుగా సచివాలయానికి రావడంలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు...
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సా హ్ని ఆరు నెలలుగా సచివాలయానికి రావడంలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఉద్యోగుల పట్ల సీఎస్ సానుకూల దృక్పథంతో ఉంటారని, సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఫైలు అయినా 2-3 రోజుల్లో క్లియర్ చే సేస్తారని, పెండింగ్ ఏమీ లేవని పేర్కొన్నారు. సమస్యల సాకుతో నిజాయతీ అధికారులను విమర్శించడం తగదని హితవు పలికారు.