-
-
Home » Andhra Pradesh » NO VOTE UNTIL ROADS ARE LAID
-
రోడ్డేస్తేనే ఓటు
ABN , First Publish Date - 2020-03-13T09:08:59+05:30 IST
రోడ్లేస్తేనే ఓట్లేస్తామంటూ భీష్మించారు కృష్ణాజిల్లా పామర్రులోని రామాంజనేయ కాలనీ వాసులు. ఎన్నికల సమయంలో ఇలా పట్టుబట్టడంతో పార్టీల నేతలు సతమతమవుతున్నారు. కాలనీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్నా...

రోడ్లేస్తేనే ఓట్లేస్తామంటూ భీష్మించారు కృష్ణాజిల్లా పామర్రులోని రామాంజనేయ కాలనీ వాసులు. ఎన్నికల సమయంలో ఇలా పట్టుబట్టడంతో పార్టీల నేతలు సతమతమవుతున్నారు. కాలనీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్నా, తమ ప్రాంతంపై అధికారులు, నాయకులు శీతకన్ను వేయడంపై ఓటర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రోడ్ల దుస్థితిపై కాలనీలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాలనీలో విద్యుత్ సౌకర్యం లేక విషపురుగులతో సావాసం చేస్తున్నామని, రోడ్డు పూర్తిగా ధ్వంసమై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలనీలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యం కల్పించడానికి రూ.1.30కోట్లు కేటాయించినా, అధికారుల అలసత్వం కారణంగా పనులు చేపట్టలేదు. - పామర్రు