తుంగభద్రలో నదీస్నానాలు లేవు: కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-14T02:08:52+05:30 IST
తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుంగభద్రలో
కర్నూలు: తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుంగభద్రలో నదీస్నానాలు లేవని ప్రకటించారు. ఈ-టికెట్‌తోనే ఘాట్ల వద్ద సాంప్రదాయ పూజలు, పిండ ప్రదానాలకు అనుమతిస్తామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. తుంగభద్ర పుష్కరాలు ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు జరుగుతాయి. కర్ణాటక ఎగువ భాగం నుంచి ప్రవహించే తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. ఏపీలోని కౌతాళం మండలం, మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ఈ నది ప్రవేశిస్తోంది. కౌతాళం, నందవరం, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, గూడూరు మండలాలతో పాటు కర్నూలు పట్టణం గుండా ప్రవహించే ఈ నదికి 107 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది.