-
-
Home » Andhra Pradesh » no entry into temples till 31 st
-
గుళ్ళల్లోకి... 31 వరకు భక్తులకు నో ఎంట్రీ...
ABN , First Publish Date - 2020-05-18T20:22:31+05:30 IST
దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో... లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

అమరావతి : దేవాలయాల్లోకి ఈ నెల 31 వరకు భక్తులకు ప్రవేశముండబోదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల నేపధ్యంలో... లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31 వ తేదీ వరకు పొడిగించినందున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు వెల్లడించారు. అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలే అప్పటివరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
అయితే... అన్ని దేవాలయాల్లో కూడా యధావిధిగా నిత్య పూజలు. సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు. అదే విధంగా ఆర్జిత సేవల కోసం ‘ఆన్‌లైన్’ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను మంత్రి ఆదేశించారు.