నో ఎన్‌క్యాష్‌మెంట్‌!

ABN , First Publish Date - 2020-11-19T09:44:18+05:30 IST

లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌(ఈఎల్‌), జీపీఎ్‌ఫల కోసం పోలీసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు శాఖలోని ఉద్యోగులు ఎప్పుడూ

నో ఎన్‌క్యాష్‌మెంట్‌!

జీపీఎఫ్‌దీ అదే పరిస్థితి.. పోలీసుల ఎదురుచూపు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) 

లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌(ఈఎల్‌), జీపీఎ్‌ఫల కోసం పోలీసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు శాఖలోని ఉద్యోగులు ఎప్పుడూ చూడని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. రోజులు గడుస్తున్నా ఈఎల్స్‌ బిల్లులకు మోక్షం రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పోలీసు ఉద్యోగులకు ఏటా 45 ఈఎల్స్‌ ఉంటాయి. వీటిని వినియోగించుకోనివారికి.. సర్వీస్‌ రోల్‌ ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఈఎల్స్‌ను ఎన్‌క్యాష్‌ చేస్తుంటా రు. అయితే.. గత 4 నెలలుగా ఈఎల్‌ చెల్లింపులు నిలిచిపోయాయి. జూలైలో ఆ నెల వరకు రావాల్సిన వారికి ఎన్‌క్యాష్‌ చేశారు. ఆ తర్వాత నుంచి నిలిపివేశారు. మరోవైపు.. జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎఫ్‌) కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఎదురు చూస్తున్నారు. అవసరాలకోసం అప్పులు చేయాల్సి వస్తే జీపీఎ్‌ఫను ఎంచుకుంటారు. తీసుకొన్న మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. ఈ ఏడాది కొందరు ఉద్యోగులు జీపీఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల కాలేదు. కాగా, ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు విడుదల కాకపోవడం వల్లే  ఇలా జరుగుతోందని పే అండ్‌ అకౌంట్స్‌ విభాగం అధికారులు చెబుతున్నారు.


సీఎం గారూ.. స్పందించండి: పోలీసులకు చెల్లించే లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, జీపీఎఫ్‌ ఆగిపోవడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ పోలీసు అధికారి వర్ల రామయ్య ట్విట్టర్‌లో స్పందించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే స్పందించాలన్నారు.

Updated Date - 2020-11-19T09:44:18+05:30 IST