లాక్ డౌన్‌పై క్లారిటీ లేదు: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-05-18T16:42:35+05:30 IST

లాక్ డౌన్‌పై కేంద్రప్రభుత్వం నిన్న చేసిన ప్రకటనలో సరైన క్లారిటీ లేదని..

లాక్ డౌన్‌పై క్లారిటీ లేదు: టీడీపీ నేత

అమరావతి: లాక్ డౌన్‌పై కేంద్రప్రభుత్వం నిన్న చేసిన ప్రకటనలో సరైన క్లారిటీ లేదని ఏపీ టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ విమర్శించారు. సోమవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ లాక్ డౌన్‌పై నిన్న కేంద్రం చేసిన ప్రకటన.. పొడిగింపా? లేక తొలగింపా? అన్నది అర్థం కాలేదన్నారు. వలస కార్మికులను తరలించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని, వారి కోసం శ్రామిక్ రైళ్లు కూడా నడుపుతోందని.. అయితే వచ్చిన కార్మికులను ఆయా రాష్ట్రాలు సరిహద్దులోనే నిలిపివేస్తున్నారని, దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. దీనికి ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. కొన్ని నిర్ణయాలు ఆయా రాష్ట్రాలు తీసుకోవాలని కేంద్రం చెప్పడం కూడా సరికాదని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుసరించాలన్నది కూడా కేంద్రమే నిర్ణయించి ప్రకటన చేయాలని రామకృష్ణ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-18T16:42:35+05:30 IST