-
-
Home » Andhra Pradesh » No alcohol until 31
-
31 వరకు మద్యం లేదు
ABN , First Publish Date - 2020-03-24T09:47:58+05:30 IST
లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం అ మ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సోమవారం అన్ని...

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం అ మ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, సీ1 క్లబ్బులు, తాత్కాలిక లైసెన్సులు అన్నీ ఈ నెల 31 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి.