కనీస వేతనం రూ.26వేలు: ఎన్ఎంయూ వినతి
ABN , First Publish Date - 2020-05-29T07:55:18+05:30 IST
కనీస వేతనం రూ.26వేలు: ఎన్ఎంయూ వినతి

విజయవాడ, మే 28(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో కనీస వేతనం రూ.26వేలు ఉండాలని పీఆర్సీ కమిషనర్‌కు ఎన్ఎంయూ విజ్ఞప్తి చేసింది. వేతన సవరణపై ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఇతర నాయకులు గురువారం పీఆర్సీ సెక్రటరీ పాపారావును కలిసి ప్రతిపాదనలు అందించారు.