-
-
Home » Andhra Pradesh » Nirmala Seetharaman intarcts with farmers
-
రైతులను కలిసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ABN , First Publish Date - 2020-10-07T18:43:15+05:30 IST
విజయవాడ: గన్నవరం జక్కుల నెక్కలం గ్రామంలో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రైతులను కలిశారు.

విజయవాడ: గన్నవరం జక్కుల నెక్కలం గ్రామంలో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రైతులను కలిశారు. రైతుల పంట, గిట్టుబాటు ధర, మార్కెట్ పరిస్థితిపై నిర్మల ఆరా తీశారు. ధాన్యం, చెరకుకు గిట్టుబాటు ధర ఉండటం లేదని రైతులు నిర్మలకు తెలిపారు. వరికి క్వింటాకు రూ.2వేలు మద్దతు ధర ఇవ్వాలన్నారు.
కల్లాల్లో ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం వల్ల కరివేపాకు ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పించేలా చూడాలని రైతులు కోరారు. రైతుల సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం కోసమే... కేంద్రం చట్టం తెచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.