కురిచేడు ఘటనలో కీలక నిందితుడు సహా 9 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2020-08-11T17:57:51+05:30 IST
ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనలో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో పాటు మరో తొమ్మిది మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనలో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో పాటు మరో తొమ్మిది మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మిథైల్ క్లోరిఫైడ్ రసాయనాన్ని సరఫరా చేసిన షేక్ దావూద్, మహమ్మద్ ఖాజీ, డిస్ట్రిబ్యూటర్ కేశవ్ అగర్వాల్ సిట్ అదుపులో ఉన్నారు. పేరు మోసిన విత్తన ఉత్పత్తి కంపెనీలు విత్తన శుద్ధిలో ఉపయోగించిన అనంతరం వేస్టేజ్‌గా పడి ఉన్న రసాయనాలను కొనుగోలు చేసి నిందితులకు సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. రసాయనాలకు లైసెన్స్ ఉన్నప్పటికీ శానిటైజర్ ఉత్పత్తులకు సరఫరా చేయడం నేరమని సిట్ భావించింది. వీరితో పాటు సిట్ అదుపులో కురిచేడు మెడికల్ షాపుల నిర్వహకులు సుధాకర్, ఫణి, సుబ్బారావు, రమేష్, సురేంద్ర ఉన్నారు. మరికొద్ది సేపట్లో నిందితులను సిట్ బృందం మీడియా ముందు పెట్టనుంది.