చంద్రబాబు హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి: నిమ్మల
ABN , First Publish Date - 2020-02-08T21:29:36+05:30 IST
చంద్రబాబు హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబుపై కక్షతోనే జగన్ రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన

విశాఖపట్నం: చంద్రబాబు హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబుపై కక్షతోనే జగన్ రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతలు భీమిలిలో ఇప్పటికే 600 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా కోసం విశాఖలో రూ.300 కోట్లు విదేశీ నిధులు పెట్టారని అన్నారు. యజమానిని బెదిరించి తగరపు వలస జ్యూట్ మిల్లును లాక్కున్నారని నిమ్మల ఆరోపించారు. కార్తీకవనం భూమిని సైతం బెదిరించి తీసుకున్నారని అన్నారు. అంతేకాదు సిరిపురంలో మిషనరీకి చెందిన భూమిని లాక్కున్నారని, ఇప్పుడు వాల్తేరు క్లబ్‌ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్‌ని వ్యతిరేకించిన జగన్.. ఇప్పుడు 6వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ బిల్డ్ పేరుతో 4వేల ఎకరాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని నిమ్మల ఆరోపించారు.