మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న చినరాజప్ప
ABN , First Publish Date - 2020-04-08T20:00:39+05:30 IST
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పెద్దపులి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అడ్డుకున్నారు.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పెద్దపులి చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అడ్డుకున్నారు. ఓవైపు ప్రజలను కరోనా భయపెడుతుంటే మరోవైపు మట్టి మాఫియా చెలరేగిపోతుందన్నారు. నాలుగు రోజుల క్రితం మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని.. అప్పుడు తవ్వకాలను నిలిపివేసి మళ్లీ మొదలు పెట్టారని చినరాజప్ప తెలిపారు.
చెరువులో లోతుగా తవ్వకాలు చెయ్యడం వల్ల నీరు అందక ఆయకట్టు రైతు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తవ్వకాలు జరుపుతున్న చెరువును పరిశీలించి అక్కడ నుంచి జిల్లా కలెక్టర్‌కు చినరాజప్ప ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్దపులి చెరువులో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని.. తవ్వకాలపై విచారణ జరిపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.