హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి జీవం

ABN , First Publish Date - 2020-05-30T07:37:15+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభు త్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ ..

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి జీవం

నిమ్మగడ్డ తొలగింపు అన్యాయమని.. పిల్‌ వేశాం : కామినేని


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభు త్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి మరోసారి జీవం పోసినట్టయిందని బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. హైకో ర్టు తీర్పుపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రమేశ్‌ తొలగింపు అన్యాయమనిపించి హైకోర్టులో పిల్‌ వేశామన్నారు. జగన్‌ ఆ లోచనా విధానం అంతా వేరుగా ఉందని విమర్శించారు. తన సొంత అజెండాను అమలు చే స్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయ న పార్టీలోనూ చర్చించుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలను వాయిదా వేస్తూ రమేశ్‌కుమార్‌ నా డు నిర్ణయం తీసుకోకపోతే, నేడు కరోనా వ్యాప్తిలో రాష్ట్రం టాప్‌లో ఉండేద ని పేర్కొన్నారు.


ఇప్పటికైనా జగన్‌ కోర్టుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిదన్నారు. చివరకు రంగుల విషయంలోనూ హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుబట్టినా దాన్నే పట్టుకుని సాగదీస్తున్నారని ఎద్దేవా చేశారు. జగ న్‌ నిర్ణయాల వల్ల అధికారులు కోర్టు మెట్లు ఎక్కి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకైన ఘటనలో విశాఖకు వెళ్లిన సీఎం... ముందుగా కంపెనీ ప్రతినిధులను కలవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం అస్థిరపడి తే ప్రత్యేకహోదా అడుగుతానని చెప్తున్న జగన్‌, అదే సమయం వస్తే తన వ్యక్తిగత అంశాలను సాధించుకుంటారని దుమ్మెత్తిపోశారు. కాగా, తొందరపాటుతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి తీర్పులే పునరావృతమవుతాయని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.


రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలు ఉంటాయనే విషయా న్ని జగన్‌ ప్రభుత్వం తెలుసుకుని వ్యవహరించాలని హితవు పలికారు.   జగన్‌ ప్రభుత్వ చర్యల వల్ల ఏపీ పరువు పోయిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కాగా, భారీ మెజారిటీ వచ్చినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే సాధ్యం కాదన్న విషయం జగన్‌ తెలుసుకోవాలని వల్లూరి జేపీ సూచించారు.


జగన్‌ రాజీనామా చేయాలి: బైరెడ్డి  

  సీఎం జగన్‌ విశ్వసనీయతను కోల్పోయారని, వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బైౖరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 


ఇకనైనా తీరు మార్చుకోవాలి: సాకే

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగేలా హైకోర్టు తీ ర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. జగన్‌ ఆలోచనా తీరు మార్చుకోవాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించా రు. జగన్‌ అస్తవ్యస్త పాలనపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 


ప్రజాస్వామ్యానికి న్యాయం: వామపక్షాలు

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, నిమ్మగడ్డకు న్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు.

Updated Date - 2020-05-30T07:37:15+05:30 IST