నిమ్మగడ్డ విజ్ఞప్తిపై స్పందించిన రాజ్ భవన్

ABN , First Publish Date - 2020-07-22T16:56:39+05:30 IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజ్ఞప్తిపై రాజ్‌భవన్‌ స్పందించింది. రమేష్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించి ఎస్ఈసీగా నియమించాల్సిందిగా జగన్ సర్కార్‌కు

నిమ్మగడ్డ విజ్ఞప్తిపై స్పందించిన రాజ్ భవన్

విజయవాడ: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజ్ఞప్తిపై రాజ్‌భవన్‌ స్పందించింది. రమేష్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించి ఎస్ఈసీగా నియమించాల్సిందిగా జగన్ సర్కార్‌కు గవర్నర్ సూచించారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వకపోవడంతో.. పాత స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా నిమ్మగడ్డ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్‌ను రమేశ్ కుమార్‌ కలిశారు. తన సమస్యను ఓపికతో విని సానుభూతితో పరిశీలిస్తానని.. గవర్నర్ హామీ ఇచ్చిన విషయాన్ని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ తాజా ఆదేశాలు జారీ చేసింది.Updated Date - 2020-07-22T16:56:39+05:30 IST