నెట్టింట్లో వైరల్ అవుతున్న ఎన్నికల షెడ్యూల్‌పై నిమ్మగడ్డ క్లారిటీ

ABN , First Publish Date - 2020-09-05T23:19:34+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఎన్నికల షెడ్యూల్‌పై నిమ్మగడ్డ క్లారిటీ

అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ఎన్నికల కమిషనర్‌గా తాను ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని, ప్రోత్సహించే విధంగా ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఇది కేవలం తప్పుడు సమాచారం మాత్రమేనని.. ఇందులో వాస్తవికత లేదని మరోసారి ఎన్నికల కమిషనర్ తెలిపారు.


నెట్టింట్లో వైరల్ అయిన షెడ్యూల్ ఇదే..

ఎంపీటీసి, జడ్పీటిసి ఒక విడుతగా, మున్సిపల్ ఒక విడతగా, పంచాయితీలు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఎన్నికల కోడ్ తక్షణమే అమలోకి వస్తుంది. 

- ఈ నెల 9 నుంచి 11 వరుకు నామినేషన్స్

-  21 న పోలింగ్

- 24 కౌంటింగ్


:- మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ 

- ఈ నెల 11 నుండి 13 వరుకు నామినేషన్స్

- 23 పోలింగ్

- 27 కౌంటింగ్ ఉంటుంది


రెండు ఫేజ్‌లుగా గ్రామ పంచాయితీ ఎన్నికలు

ఫేజ్ :- 1 

- 17 నుంచి 19 వరుకు నామినేషన్స్

- 27 న పోలింగ్

- అదే రోజు కౌంటింగ్ 


ఫేజ్ :- 2 

- ఈ నెల 19 నుంచి 21 వరుకు నామినేషన్స్ 

- 29 న పోలింగ్..  29నే కౌంటింగ్


ఓటర్లని ప్రభావితం చేసే ఏ ప్రభుత్వ స్కీమ్స్ అయినా అమలు నిలుపుదల చేయాలి. బదిలీలు, నియామకాలు నిషేదం. ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం. స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్‌లో ఉంది. కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోము. కార్యాలయాలకు రంగుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం. సిబ్బంది కొరతలేదు. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్‌ని వాడుకుంటాం అని గత 24 గంటలుగా ఈ షెడ్యూల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Updated Date - 2020-09-05T23:19:34+05:30 IST