‘నిమ్మగడ్డ’ కేసు విచారణ వాయిదా

ABN , First Publish Date - 2020-08-12T09:12:02+05:30 IST

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన ‘కోర్టు ధిక్కరణ పిటిషన్‌’పై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం,

‘నిమ్మగడ్డ’ కేసు విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన ‘కోర్టు ధిక్కరణ పిటిషన్‌’పై విచారణను నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం సమ్మతించింది. నాలుగు వారాలపాటు విచారణను వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ మహ్‌ఫూజ్‌ నజ్కీ, ప్రతివాదిగా ఉన్న టీడీపీ నేత వర్ల రామయ్య తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ గుంటూరు ప్రమోద్‌ కుమార్‌ విచారణకు హాజరయ్యారు. 

Updated Date - 2020-08-12T09:12:02+05:30 IST