నిడదవోలు ఆర్టీసీ బస్‌ డిపో జలమయం

ABN , First Publish Date - 2020-10-13T20:57:40+05:30 IST

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఆర్టీసీ బస్ డిపో జలమయం అయింది.

నిడదవోలు ఆర్టీసీ బస్‌ డిపో జలమయం

ప.గో.జిల్లా: రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఆర్టీసీ బస్ డిపో జలమయం అయింది. డిపోలోని కంప్యూటర్, బ్యాటరీ సెక్షన్, విలువైన రికార్డులు ఉన్న గదిలోకి నీరు చేరడంతో మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. పట్టణంలో తేలిక పాటి వర్షం కురిసినా బస్టాండ్ ఆవరణ జలమయం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డిపో సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. భారీ వర్షాలకు ఏలూరులోనూ ఆర్టీసీ డీపో నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోని పరిస్థితి దయనీయంగా మారింది. 

Updated Date - 2020-10-13T20:57:40+05:30 IST