ఉద్యోగులంతా విశాఖ వెళ్లడానికి సిద్ధం: చంద్రశేఖర్
ABN , First Publish Date - 2020-11-04T01:38:31+05:30 IST
ఉద్యోగులంతా విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అవతరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారని
అమరావతి: ఉద్యోగులంతా విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అవతరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు విశాఖలో ఉంటున్న ఉద్యోగులకు.. విశాఖకు వచ్చే ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో కట్ చేసిన జీతాలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. కరోనా తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అవసరమైతే కోర్టుకు వెళ్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు.