కొత్తగా 6,555 కేసులు
ABN , First Publish Date - 2020-10-03T06:49:13+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గం టల్లో 70,399
రాష్ట్రంలో మరో 31 మంది బలి
ఆరు వేలకు చేరువైన మరణాలు
ఏడుగురు సీబీఐ అధికారులకూ వైరస్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గం టల్లో 70,399 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,06,790కి చేరుకుంది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 975 కేసులు నమోదవగా.. చిత్తూరులో 925, ప్రకాశంలో 668 మంది కరోనా బా రినపడ్డారు. శుక్రవారం 7,485 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీల సంఖ్య 6,43,993కి పెరిగింది. ప్రస్తుతం 56,897 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనాతో మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,900కి పెరిగింది.
కాగా, తూర్పుగోదావరిలో తాజాగా నమోదైన 975 కేసులతో జిల్లాలో బాధితుల సంఖ్య 99,135కి చేరుకుంది. శనివారం ఈ సంఖ్య లక్షకు చేరుకునే అవకా శం ఉంది. జిల్లాలో తాజాగా నలుగురు కరోనాతో చనిపోవడంతో మొత్తం మరణాలు 532కి పెరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 808 కొవిడ్ కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య 73,940కి చేరింది. మరో ఇద్దరి మృతితో మరణాల సంఖ్య 457కి పెరిగింది.
ఇదిలావుంటే, అమరావతి సచివాలయంలో శుక్రవారం మరో ఆరుగురు ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో కేసుల సంఖ్య 186కి పెరిగింది. వ్యవసాయశాఖలో సెక్షన్ అధికారికి, విద్యాశాఖలో డేటాఎంట్రీ ఆపరేటర్‌కు, సాధారణ పరిపాలనాశాఖలో ఏఎ్‌సవోకి, అటెండర్‌కు, యూత్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో టైపి్‌స్టకు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పేషీలో అటెండర్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
ఏడుగురు సీబీఐ అధికారులకు కరోనా:
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ కోసం కడపకు వచ్చిన సీబీఐ అధికారుల బృందంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గురువారం ఓ అధికారి అనారోగ్యానికి గురికావడంతో కొవిడ్ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది.
దీంతో మిగిలిన అధికారులంతా శుక్రవారం కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షలు చేయించుకోగా మరో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.