-
-
Home » Andhra Pradesh » Newly 1031 positive cases
-
కొత్తగా 1,031 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-11-27T10:03:41+05:30 IST
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా...

ఎనిమిది మంది మృతి
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. జిల్లాల వారీగా... కృష్ణాలో ఇద్దరు బాధితులు, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖ, జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6,970 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705కి చేరింది. 8,46,120 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 12,615 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 98,55,316 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
జిల్లాల వారీగా..
విజయనగరం జిల్లా లో గురువారం 29 కరో నా కేసులు, కృష్ణా జిల్లా లో 162, చిత్తూరు జిల్లా లో 102, గుంటూరు జిల్లాలో 172, తూర్పుగోదావరి జిల్లాలో 117, శ్రీకాకుళం జిల్లాలో 23, కడప జిల్లాలో 55, కర్నూలు జిల్లాలో గత 24గంటల్లో జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.