-
-
Home » Andhra Pradesh » New virus in AP
-
ఏపీలో కొత్త వైరస్ కలకలం
ABN , First Publish Date - 2020-12-28T10:22:03+05:30 IST
ఏపీలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం మొదలైంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది.

మొత్తంగా 10మంది అనుమానితులు
పుణె, బెంగళూరు ల్యాబ్‌కు నమూనాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి) :ఏపీలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం మొదలైంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 1,187మంది ఆచూకీ లభించగా, ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరినుంచి మరోసారి నమూనాలు తీసుకుని పుణె, బెంగళూరు ల్యాబ్‌లకు పంపారు. ఈ ఆరుగురిలో గుంటూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ ఆరుగురి కుటుంబసభ్యుల్లో మరో నలుగురికీ పాజిటివ్ వచ్చింది. ఇందులో ముగ్గురు గుంటూరులో, ఒకరు నెల్లూరులో ఉన్నారు. మొత్తంగా కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలో పదిమంది చికిత్స పొందుతున్నారు. అయితే లండన్ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కనిపిస్తున్న లక్షణాలు కొత్త రకానివేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోనూ ముగ్గురికి ఇవే లక్షణాలు కనిపించాయి. అయితే ఇది కొత్త స్ట్రెయిన్ ద్వారా వచ్చిందా, ఇప్పటికే ఉన్నదేనా అనే విషయం సోమవారం వచ్చే రిపోర్టుల్లో తేలనుంది.