ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు కరోనా

ABN , First Publish Date - 2020-12-11T07:38:14+05:30 IST

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కరోనా సోకింది. రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు కరోనా

రాష్ట్రంలో కొత్త కేసులు 538.. ఇద్దరు మృతి 


అమరావతి/గుంటూరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కరోనా సోకింది. రెండు రోజులుగా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిరోజుల పాటు తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని అభిమానులు, కార్యకర్తలకు ఆయన గురువారం విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో కొత్తగా 538 కరోనా కేసులు నమోదయ్యాయి. 64,354 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. చిత్తూరులో 95 మంది, కృష్ణా 86, పశ్చిమగోదావరి 72, గుంటూరు 72, తూర్పుగోదావరి 50, శ్రీకాకుళం 21, కర్నూలు 18, కడప 13, విజయనగరంలో ఏడుగురికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకూ 8,73,995 మంది కరోనా బారినపడగా 8,61,711 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అన్ని జిల్లాల్లో కలిపి 5,237 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌కు చికిత్స పొందుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 7,047కి చేరాయి. 

Updated Date - 2020-12-11T07:38:14+05:30 IST