వీడని అంతర్వేది రథం దగ్ధం మిస్టరీ..

ABN , First Publish Date - 2020-12-27T17:38:08+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్వేది రథం దగ్ధం ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు.

వీడని అంతర్వేది రథం దగ్ధం మిస్టరీ..

రాజమండ్రి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్వేది రథం దగ్ధం ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. అయితే జగన్ ప్రభుత్వం రథం దగ్ధం ఘటనను పక్కన పెట్టి కొత్త రథం తయారీపై విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. సెప్పెంబర్ 6న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన రథం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై అప్పటి నుంచి పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. అయినా ఎలాంటి పురోగతి లేదు. ప్రభుత్వం మాత్రం కొత్త రథాన్ని తయారుచేయిస్తోంది.

Updated Date - 2020-12-27T17:38:08+05:30 IST