-
-
Home » Andhra Pradesh » New 443 Corona Cases in AP
-
ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-22T22:04:51+05:30 IST
కరోనా మహమ్మారి రాష్ట్రంలోని నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ఏరోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతోంది.

అమరావతి: కరోనా మహమ్మారి రాష్ట్రంలోని నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ఏరోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతోంది. గత 24 గంటల్లో 443 మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఇవాళ ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో 9,372కు కరోనా కేసులు చేరాయి. స్థానికంగా ఉంటున్న 392 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా మరణాలు 111కు చేరాయి. ప్రస్తుతం 4,826 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాను జయించిన 4,435 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా వైరస్ విజృంభిస్తోంది. జనాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అన్ని దుకాణాలు తెరవడం, ప్రజలు తమ అవసరాల కోసం రోడ్లపైకి రావడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారితో కూడా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి జరుగుతోంది.