కోటంరెడ్డి అరెస్ట్‌కు పోలీసుల యత్నం...అడ్డుకున్న జర్నలిస్టులు
ABN , First Publish Date - 2020-08-20T18:30:52+05:30 IST
టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

నెల్లూరు: టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం జర్నలిస్టు క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కోటంరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసులును అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే జర్నలిస్టు క్లబ్‌లో అరెస్ట్ ఎలా చేస్తారని నిలదీస్తూ జర్నలిస్టులు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.