నెల్లూరు షార్‌లో గందరగోళం.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-05-08T23:18:57+05:30 IST

నెల్లూరు : జిల్లాలోని షార్‌ (సతీష్ థావన్ స్పేస్ సెంటర్) లో గందరగోళం నెలకొంది.

నెల్లూరు షార్‌లో గందరగోళం.. ఉద్రిక్తత

నెల్లూరు : జిల్లాలోని షార్‌ (సతీష్ థావన్ స్పేస్ సెంటర్) లో గందరగోళం నెలకొంది. లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు ఇంటికి పంపుతున్నాయి. అయితే షార్‌లో పనిచేస్తున్న వారిలో బీహార్‌కు చెందిన పలువురు కార్మికులను ఇళ్లకు పంపిన అధికారులు తమను మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదంటూ ఝార్ఖండ్‌కు చెందిన కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షార్ ముందు, లోపల కార్మికులు హల్ చల్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం 200 మంది ఒక్కసారిగా ఇలా ఆందోళన చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులను సైతం తోసుకుంటూ వెళ్లి.. లోపలనున్న బస్సులు, భవనాల అద్దాలు, ధ్వంసం చేశారు.


వాగ్వివాదాలు..

ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కార్మికులపై లాఠీ చార్జ్‌ చేశారు. వారందర్నీ షార్ లోపల్నుంచి బయటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకున్నారు. పోలీసులు-కార్మికుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదాలు జరుగుతున్నాయి. కార్మికులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు మాత్రం సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కార్మికులను మాత్రం బలవంతంగానే వారు ఉంటున్న ప్రాంతానికే బస్సుల్లో పోలీసులు తరలించేస్తున్నారు. ఇలాంటి తరుణంలో షార్ అధికారులు ఆ కార్మికులను తరలించేందుకు ఒప్పుకుంటారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-05-08T23:18:57+05:30 IST