నెల్లూరు: రాత్రివేళల్లో దొంగచాటుగా సామూహిక ప్రార్థనలు

ABN , First Publish Date - 2020-04-24T14:57:29+05:30 IST

నెల్లూరు: రాత్రివేళల్లో దొంగచాటుగా సామూహిక ప్రార్థనలు

నెల్లూరు: రాత్రివేళల్లో దొంగచాటుగా సామూహిక ప్రార్థనలు

నెల్లూరు: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటుంటే కొందరు మాత్రం తమకు తోచిన విధంగా చేస్తూ కరోనా వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. జిల్లాలోని ఏఎస్‌పేటలోని ఖాజా రసూల్‌ దర్గాలో  కొందరు వ్యక్తులు రాత్రివేళ్లలో దొంగచాటుగా  సామూహిక ప్రార్థనలు చేపట్టారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘాలో ఈ ఘటన వెలుగు చూసింది. కరోనా దరిచేరదని, కొత్త శక్తులు వస్తాయని ప్రచారం చేస్తూ ముతావలి హఫీజ్‌ పాషా అనే వ్యక్తి దర్గా వెనుకవైపు నుంచి ప్రతి రోజు 50 మందిని లోపలికి పంపి ప్రార్థనలు, పూజలు చేయిస్తున్నారు. ఇందుగాను ఒక్కొక్కరి నుంచి ముతావలి వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-04-24T14:57:29+05:30 IST