నెల్లూరు జిల్లాకు పిడుగు హెచ్చరిక..

ABN , First Publish Date - 2020-09-29T21:33:34+05:30 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాకు పిడుగు హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలోని జలదంకి, అల్లుర్, దగదర్తి,

నెల్లూరు జిల్లాకు పిడుగు హెచ్చరిక..

నెల్లూరు: నెల్లూరు జిల్లాకు పిడుగు హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలోని జలదంకి, అల్లుర్, దగదర్తి, కలిగిరి, అనుమసముద్రంపేట, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, పొదలకూర్, బాగోలే, మర్రిపాడు, చేజర్ల గ్రామాల్లో పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు  చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. 

Updated Date - 2020-09-29T21:33:34+05:30 IST