నెల్లూరు: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ABN , First Publish Date - 2020-06-23T14:47:42+05:30 IST

నెల్లూరు: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

నెల్లూరు: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

నెల్లూరు: జిల్లాలోని కావలి ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయ్యింది. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన గంగపట్నం ప్రభు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో వైద్యం అందక ప్రభు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రభు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 

Read more