నెల్లూరులో రౌడీషీటర్ హత్య

ABN , First Publish Date - 2020-09-18T12:18:20+05:30 IST

జిల్లాలోని సీఎం స్కూల్ వద్ద పాత నేరస్తుడు, రౌడీషీటర్‌ దాుణ హత్యకు గురయ్యాడు.

నెల్లూరులో రౌడీషీటర్ హత్య

నెల్లూరు: జిల్లాలోని సీఎం స్కూల్ వద్ద పాత నేరస్తుడు, రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవిస్తూ మాటా మాట పెరగడంతో రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు  అతి దారుణంగా కొట్టి చంపినట్టు సమాచారం.  విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు బిరియాని బాషాగా గుర్తించారు. అతడిపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-18T12:18:20+05:30 IST