నెల్లూరు: సోమేశ్వరాలయంలో వినాయక విగ్రహం అపహరణ

ABN , First Publish Date - 2020-08-22T18:49:25+05:30 IST

జిల్లాలోని అనంతసాగరం మండలం సోమశిల సోమేశ్వరాలయంలో వినాయక విగ్రహాని దుండగులు అపహరించారు.

నెల్లూరు: సోమేశ్వరాలయంలో వినాయక విగ్రహం అపహరణ

నెల్లూరు: జిల్లాలోని అనంతసాగరం మండలం సోమశిల సోమేశ్వరాలయంలో  వినాయక విగ్రహాన్ని దుండగులు అపహరించారు. వినాయక చవితి రోజు విగ్రహాన్ని దుండగులు మాయం చేశారు. జలాశయం సమీపంలోని అతి పురాతనమైన శివాలయంలో వందల ఏళ్లనాటి  వినాయక విగ్రహాన్ని కొందరు ఆగంతకులు భక్తుల రూపంలో గుడికి  వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై గుడి పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-08-22T18:49:25+05:30 IST