విజయవాడలో కోలుకుంటున్న బాధితుడు
ABN , First Publish Date - 2020-03-24T09:58:53+05:30 IST
కృష్ణా జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసుగా నమోదైన విజయవాడ పాతబస్తీకి చెందిన యువకుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ యువకుడు ప్యారిస్ నుంచి
కుటుంబ సభ్యులకు నెగెటివ్
విజయవాడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసుగా నమోదైన విజయవాడ పాతబస్తీకి చెందిన యువకుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ యువకుడు ప్యారిస్ నుంచి ఈ నెల 17న ఢిల్లీ, హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నాడు. కరోనా అనుమానంతో అతన్ని ఈ నెల 20న ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఆ యువకుడు నాలుగు రోజులు ఇంట్లోనే ఉండడంతో అతని తల్లి, తండ్రి, తమ్ముడిని కూడా అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. వారి రిపోర్టుల్లో నెగెటివ్ అని తేలడంతో సోమవారం వారిని డిశ్చార్జి చేశారు. అయినా వారు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.