నీట్ పరీక్షలు నిర్వహించడం మోదీకి తగదు: విద్యార్థుల తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2020-09-13T19:47:08+05:30 IST

నీట్ పరీక్షల కోసం కడప, అనంతపురం వంటి రాయలసీమ జిల్లాల నుంచి పిల్లలతో తల్లిదండ్రులు తిరుపతి చేరుకున్నారు.

నీట్ పరీక్షలు నిర్వహించడం మోదీకి తగదు: విద్యార్థుల తల్లిదండ్రులు

తిరుపతి: నీట్ పరీక్షల కోసం కడప, అనంతపురం వంటి రాయలసీమ జిల్లాల నుంచి పిల్లలతో తల్లిదండ్రులు తిరుపతి చేరుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వారిని పలుకరించింది. కరోనా ప్రారంభదశలో అన్నీ లాక్ డౌన్ చేసిన మోదీ.. కరోనా తీవ్రమవుతున్నప్పుడు పరీక్షలు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరు రాష్ట్రాల సీఎంలు వద్దన్నా.. నీట్ పరీక్షలు నిర్వహించడం మోదీకి తగదని అన్నారు. తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రధానమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.


కోవిడ్ ఎక్కువగా ఉండడం.. మరోవైపు రవాణా సౌకర్యం లేకపోవడంతో సామాన్యులు ఇక్కడకు వచ్చి పరీక్షలు రాయడం ఇబ్బందిగా ఉందని ఓ విద్యార్థి తండ్రి అన్నారు. చాలా ఇబ్బందులు పడి.. దొరికిన వాహనాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వచ్చామన్నారు. గ్రామాల నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉందని మరో విద్యార్థిని చెప్పింది. తప్పని పరిస్థితుల్లో పిల్లలను తీసుకుని పరీక్షా కేంద్రాలకు వస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఏబీఎన్‌కు తెలిపారు.

Updated Date - 2020-09-13T19:47:08+05:30 IST